అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Mar 18 2026 9:39 AM | Updated on Mar 18 2026 9:39 AM

గుండాల: నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి మొక్కజొన్న చేనులో విగతజీవిగా కనిపించిన ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన మాదాల వెంకన్న (45) కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు రెండు రోజులుగా చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, కన్నాయిగూడెంలోని మొక్కజొన్న చేనులో విగతజీవిగా పడి ఉండగా గుండాల సీఐ తిరుపతి అక్కడికి వెళ్లి పరిశీలించారు. చనిపోయి మూడు రోజులు అవుతుండగా పోస్టుమార్టం అక్కడే నిర్వహించారు. కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు.

52.1 కేజీల గంజాయి పట్టివేత

భద్రాచలంఅర్బన్‌: కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు మంగళవారం పట్టణంలో పట్టుకున్నారు. పట్టణంలోని కూనవరం రోడ్డులో గల ఇసుక ర్యాంప్‌ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు కారుకి నంబర్‌ లేకుండా వెళ్తుండగా ఆపారు. తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. కారులో ఉన్న వ్యక్తిని విచారించగా మల్కాన్‌గిరికి చెందిన మిథున్‌రాయ్‌గా తేలింది. గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి నుంచి జహీరాబాద్‌కు తరలిస్తున్నట్లు అతడు ఒప్పుకున్నాడని ఎకై ్సజ్‌ సీఐ శ్రీహరి తెలిపారు. గంజాయి, కారు, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని, గంజాయి 52.1 కేజీలు ఉండగా.. రూ.41 లక్షల విలువ ఉంటుందని ఆయన వివరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు సుధీర్‌, వెంకట్‌, విజయ్‌, హనుమంతరావు, వీరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement