సూపర్‌బజార్(కొత్తగూడెం): వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు లేదా సేవకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అందులో ఉన్న వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్, అధికారులు పాల్గొన్నారు.
గ్యాస్ ఏజెన్సీ తనిఖీ
చుంచుపల్లి: జిల్లా అదనపు కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారి డి.వేణుగోపాల్ మంగళవారం విద్యానగర్‌లోని ఎంఎస్ సూర్య గ్యాస్ ఏజెన్సీ గోదాం, కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వినియోగదారులకు ఎల్పీజీ రీఫిల్ సిలిండర్లను సీనియారిటీ క్రమంలోనే పారదర్శకంగా అందజేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


