తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

Mar 14 2026 7:45 AM | Updated on Mar 14 2026 7:45 AM

టీయూఎఫ్‌ఐడీసీ ఈఈ రవి శంకర్‌

అశ్వారావుపేటరూరల్‌: మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని టీయూఎఫ్‌ఐడీసీ(తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఈఈ రవి శంకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయం, పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకులను పరిశీలించారు. నీటి తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. వేసవి కాలం నేపథ్యంలో పట్టణంలో తాగునీటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి.నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

సంత వేలం నేటికి వాయిదా

కామేపల్లి: కొమ్మినేపల్లి(పండితాపురం)లోని శ్రీకృష్ణప్రసాద్‌ పశువుల వారాంతపు సంత కౌలు వేలాన్ని వాయిదా వేశారు. ఈ వేలం శుక్రవారం జరుగుతుందని ప్రకటించగా, గ్రామానికి చెందిన భూక్యా వీరన్న, బోడా గణేష్‌, బోడా శ్రీను, ధరావత్‌ విన్నిబాబు, గుగులోత్‌ వినోద్‌కుమార్‌ ధరావత్‌ సొమ్ము, సాల్వెన్సీ రూ.35 లక్షల చొప్పున చెల్లించి హాజరయ్యారు. మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్ట్యా వేలం వద్ద బందోబస్తు ఏర్పాటుచేయలేమని పోలీసులు వెల్లడించారు. దీంతో వేలాన్ని శనివారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement