ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 29 బ్రాంచ్‌లతో వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాంగళ్య షాపింగ్ మాల్‌ను ఖమ్మంలో ఈ నెల 13వ తేదీన ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా, ఖమ్మం నగర ప్రజలకు సరికొత్తడిజైన్లు, విభిన్న మోడళ్లతో ఈ షాపింగ్ మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెడ్డింగ్ కలెక్షన్లు, మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం వేలాది రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. కాగా, ప్రారంభోత్సవానికి ముందే నగరమంతా ఆకట్టుకునే విధంగా హోర్డింగ్స్, బ్యానర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీనటి శ్రీలీల మాల్‌ను ప్రారంభించనుండగా ప్రముఖులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


