భద్రాచలం: ఐటీడీఏలోని అన్ని శాఖల అధికా రులు రికార్డులతో పాటు వాటిని భద్రపరిచే గదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పలు కార్యాలయాలు, రికార్డులను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మోటార్ వెహికల్, డీజిల్, మరమ్మతులు, కోర్టు కేసులు, ఎల్‌టీఆర్ కేసులు, ఆర్టీఐ, ఆర్‌ఓఎఫ్‌ఆర్, వ్యవసాయం, విద్యు త్, ఉద్యానవన, మత్స్య తదితర శాఖలతో పాటు కొండరెడ్ల విభాగాలను సందర్శించామని వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


