అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం, ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు ఆధునికీరణకు నిధులు కేటాయించాలని కోరుతా. నియోజకవర్గంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చేందుకు నిధులు కావాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. విద్య, సాగునీటి పథకాలకు రూ. 500 కోట్లు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్తా.
– జారే ఆదినారాయణ, అశ్వారావుపేట ఎమ్మెల్యే
జీఓ 76పై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
ఇల్లెందు వాసులు ప్రస్తుతం నివాసం ఉంటున్న భూమిపై హక్కులు కల్పించేందుకు జీఓ 76ను నిరంతరం అమల్లో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతా. ఆ భూమిలో సింగరేణి లీజు పూర్తయి, వందల ఏళ్లుగా ఉంటున్న వారికి హక్కులు లేవు. కొమరారం, బోడు మండలాలు ఏర్పాటు, ఇల్లెందు రెవెన్యూ డివిజన్ తదితర అంశాలు ప్రస్తావిస్తా. – కోరం కనకయ్య,
ఇల్లెందు ఎమ్మెల్యే
భద్రాచలం శ్రీ సీతామచంద్రస్వామి వారి ఆలయంలో జరగనున్న కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం నిర్వహణకు నిధులు కావాలని కోరుతా. ఆలయ అభివృద్ధి, మాఢ వీధుల విస్తరణకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కొలిక్కి వచ్చినందున నిధులు త్వరగా మంజూరు చేయాలని అడుగుతా. రహదారులు, తాగునీరు, రైతుల సమస్యలు ప్రస్తావిస్తా. –తెల్లం వెంకట్రావ్, భద్రాచలం ఎమ్మెల్యే


