అండర్‌గ్రౌండ్‌లోకి స్వతంత్రులు | - | Sakshi
Sakshi News home page

అండర్‌గ్రౌండ్‌లోకి స్వతంత్రులు

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

అండర్‌గ్రౌండ్‌లోకి స్వతంత్రులు

అండర్‌గ్రౌండ్‌లోకి స్వతంత్రులు

పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలకు సరైన మెజార్టీ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన కార్పొరేటర్లపై పార్టీలు గురి పెట్టాయి. ఈ క్రమంలో ఆరుగురు ఇండిపెండెంట్లను తమ గూటికి తీసుకొస్తే మేయర్‌ పీఠం దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఆ పార్టీలు పడ్డాయి. అధికార పార్టీ ఒకడుగు ముందుకేసీ స్వతంత్రులను తమవైపు మళ్లించేందుకు గట్టి ప్రయత్నాలు చేపట్టడంతో పలువురు ఇండిపెండెంట్లు అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వారంతా అధికార పార్టీతో మంతనాలు జరుపుతున్నారా లేక సీపీఐతోనా అనేది చర్చనీయాంశంగా మారింది.

32 డివిజన్‌ కార్పొరేటర్‌ ఇంటి

ఎదుట ఆందోళన

ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్‌ఎస్‌ నుంచి 32వ డివిజన్‌లో గెలుపొందిన గుగులోతు రాంబాబు పార్టీ ముఖ్యనేతలకు అందుబాటులో లేకుండా వెళ్లారు. దీంతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా వెంకటేశ్వరరావు నవభారత్‌ గాంధీనగర్‌లోని రాంబాబు ఇంటికి చేరుకుని అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్‌ పార్టీనే బలవంతంగా రాంబాబును కిడ్నాప్‌ చేసిందని ఆరోపించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

అధికార పార్టీ గూటికి వెళ్లనున్నట్టు

సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement