మణుగూరు రూరల్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యలు పరిష్కారమవుతాయని ఐటీడీఏ పీఓ, స్పెషల్ ఆఫీసర్ రాహుల్ అన్నారు. ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 12వ వార్డు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. అమలవుతున్న ప్రభుత్వ పథకాలపైన లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకుని వారి ఆర్థిక స్వావలంబనకు సహకరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


