అర్హులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అర్హులకు న్యాయం చేస్తాం

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

అశ్వారావుపేటరూరల్‌: అర్హులైన గిరిజనులకు అన్యాయం చేయబోమని, భూ సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపిస్తామని కొత్తగూడెం ఆర్డీఓ డి.మధు అన్నారు. మండలంలోని రామన్నగూడెంలో 30,36,39 సర్వే నంబర్లలో భూముల్లో కొన్నేళ్లుగా గిరిజనులు, అటవీ శాఖ మధ్య వివాదం నెలకొన్నది. ఆ భూమిలో గురువారం రెవెన్యూ అధికారులు సర్వే మొదలు పెట్టారు. ఆర్డీఓ సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే, హద్దుల గుర్తింపు తర్వాత చర్యలు తీసుకుంటామని, ఇరువర్గాలు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సీహెచ్‌వీ రామకృష్ణ, సర్వేయర్లు, గిరిజనులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

కొత్తగూడెం ఆర్డీఓ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement