నాడు కుమారుడు..నేడు తల్లి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీలో గత పాలకవర్గంలో వైస్ చైర్మన్‌గా పని చేసిన వేల్పుల దామోదర్ కార్పొరేషన్ అయిన తర్వాత ఆ డివిజన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తల్లిని బరిలో నిలిపారు. బీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్న వేల్పుల వీరమ్మకు ప్రస్తుతం 75 ఏళ్లు. అయినప్పటీకి ప్రచారంలో వీరమ్మ చురుకుగా పాల్గొని డివిజన్‌లో వీధులన్నీ తిరిగారు. కార్పొరేషన్‌లో ఉన్న మిగతా 59 మంది కంటే వయసులో పెద్దది ఆమే కావడం విశేషం. శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో ఆమె 263 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి కనుకుంట్ల వెంకటరమణపై విజయం సాధించారు.


