రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Feb 9 2026 7:32 AM | Updated on Feb 9 2026 7:32 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ములకలపల్లి: ములకలపల్లికి చెందిన ఇద్దరు క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్యారమ్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. కొత్తగూడెం సీఈఆర్‌ క్లబ్‌లో నిర్వహించిన సీఎం కప్‌ జిల్లాస్థాయి పోటీల్లో మహిళా విభాగంలో నరాటి సృజన, పురుషుల విభాగంలో భాస్కరిణి అయ్యప్ప ప్రతిభ చూపి పతకాలు సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఎన్నికల నేపథ్యాన

సెక్షన్‌ 163 అమలు

ఖమ్మంక్రైం: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ఇది 9వ తేదీ నుంచి 13వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించే వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు, నాయకులు సహకరించాలని, ఓటర్లకు భద్రతా రీత్యా సమస్యలు ఎదురైతే డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని సీపీ సూచించారు.

ఇవీ సూచనలు

ఐదుగురికి కంటే ఎక్కువ మంది గుంపుగా ఉండొద్దు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా, డబ్బు, మద్యం, కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసినా చర్యలు తీసుకుంటారు. పోలింగ్‌ కేంద్రానికి కిలోమీటర్‌ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వేయడానికి అనుమతి లేదు. ఆంక్షల సమయాన మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధం. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా నేరంగా పరిగణిస్తారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక1
1/1

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement