త్వరలో గిరిమార్ట్ ప్రారంభిస్తాం
బూర్గంపాడు/ములకలపల్లి: త్వరలో భద్రాచలంలో గిరి మార్ట్‌ను ప్రారంభిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. బూర్గంపాడులోని అక్షయ గ్రామీణ చెక్క గానుగ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ–4 కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ములకలపల్లి మండల పరిధిలోని పాతూరులో పచ్చళ్లు, మిల్లెట్ స్నాక్స్, ఫుడ్ తయారీ, ఆనందపురంలో వైరుబుట్టలు, పూసుగూడెంలో పేపర్‌పేట్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించేందుకు శ్రీరామనవమికి గిరిమార్ట్ ప్రారంభిస్తామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గిరిమార్ట్‌ను వేదికగా మారుస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఐటీసీ, ఎల్‌జీడీ వంటి సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఒడినింపే కార్యక్రమంలో వారికి పండ్లు,పోషకాహారంతో కూడిన ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్‌రాజ్, రేవతి,సర్పంచ్ కుంజా రవి, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, ఎంపీడీఓ రామారావు, ఏపీఎం రామ్‌కుమార్, ఎంపీఓ రమేష్‌బాబు, అంగన్‌వాడీ కార్యకర్తలు పద్మ, సుమిత్ర, ఎల్జీడి సిబ్బంది ప్రమీల, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్


