ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయొద్దు
అశ్వారావుపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన ఎలా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజును అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అప్రమత్తంగా ఉండాలని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని, సమస్యలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అమయ్‌కుమార్, తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ, కళాశాల డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్, ఎంపీడీఓ అప్పారావు, ఎంపీఓ కోటంరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్


