తల్లిదండ్రుల చెంతకు విద్యార్థి
ఖమ్మంక్రైం: ఓ విద్యార్థి వసతి గృహం నుంచి పారిపోతుండగా, విషయాన్ని గుర్తించిన కానిస్టేబుల్ దంపతులు సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లిదండ్రులకు అప్పగించారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదివారం వసతిగృహం నుంచి బయటకు వచ్చాడు. ఆపై ఖమ్మం వెళ్తున్న బస్ ఎక్కగా.. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్.కృష్ణారావు భార్య లక్ష్మి బాలుడు ఆందోళనగా ఉండడాన్ని గమనించి ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేయగా, ఆయన ఆర్‌ఐఓ రామోజీ రమేశ్ దృష్టికి, ఆపై గురుకుల ప్రిన్సిపాల్‌కు వివరించారు. దీంతో ఖమ్మం బస్టాండ్‌లో దిగాక విద్యార్థి తండ్రి వచ్చే వరకు ఆపి అప్పగించారు. ఈ మేరకు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన లక్ష్మి దంపతులను ఆర్‌ఐ ఓ రామోజీ రమేశ్ మంగళవారం సన్మానించారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన
కానిస్టేబుల్ భార్య


