రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం

Feb 4 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:13 AM

రాష్ట

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణంలోని సిటీ స్టైల్‌ జిమ్‌కు చెందిన మహంతి వెంకటకృష్ణాజి రజత పతకం సాధించిన్నట్లు జిమ్‌ కోచ్‌ జీవీ రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌షిప్‌లో ఈ సీనియర్‌ క్రీడాకారుడు తన అద్భుత ప్రదర్శనతో రెండోస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణాజిని తెలంగాణ రాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ ఉపాధ్యక్షుడు వి.మల్లేశ్‌, జిల్లా అధ్యక్షుడు బోగాల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శివరామకృష్ణప్రసాద్‌, జాయింట్‌ సెక్రెటరీ శోభన్‌నాయక్‌, నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ శంకర్‌రావుతోపాటు ‘గ్రీన్‌ భద్రాద్రి’సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు అభినందించారు.

దొంగ సొత్తు కొన్న వ్యక్తికి ఆరు నెలల జైలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణానికి చెందిన గురజాపు రవి దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన నేరానికి గాను మంగళవారం జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వి.శివనాయక్‌ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వైఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన టీచర్‌ ముత్యాల కల్యాణ్‌బాబు ఫిర్యాదు మేరకు 2021లో భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రభుత్వం తరఫున ఏపీపీ కె.శ్రీనివాస్‌ వాదించారు.

అక్రమ కలప పట్టివేత..

దుమ్ముగూడెం: మండలంలోని చినకమలాపురం గ్రామంలో భద్రాచలం ఎఫ్‌డీఓ సుజాత ఆధ్వర్యంలో దుమ్ముగూడెం రేంజర్‌ కమల సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. కార్పెంటర్ల వద్ద ఉన్న సుమారు రూ.3 లక్షల విలువ గల దుంగలతోపాటు మూడు కోత మిషన్లను స్వాధీనం చేసుకుని భద్రాచలం కార్యాలయానికి తరలించారు. ఎఫ్‌డీఓ ఆధ్వర్యంలో సుమారు 20 మందికి పైగా సిబ్బంది గ్రామంలో తనిఖీలు చేపట్టగా భారీగా కలప దుంగలు దొరికాయి. దాడిలో చర్ల సెక్షన్‌ అధికారి రాజేశ్‌, దుమ్ముగూడెం, చర్ల బేస్‌ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పశువుల రవాణాదారులపై కేసు

అశ్వాపురం: మణుగూరు నుంచి వీఎం బంజర్‌కు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తున్న ఏడు పశువులను సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం పట్టుకొని పాల్వంచ గోశాలకు తరలించారు. మణుగూరుకు చెందిన మహమ్మద్‌ హైమద్‌, ఎండీ యాకూబ్‌పాషా, కల్లూరుకు చెందిన షేక్‌ అజ్మత్‌పై కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.

జాగిలాలతో గంజాయి హాట్‌స్పాట్ల తనిఖీ

కొత్తగూడెంఅర్బన్‌: ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాలతో కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గంజాయి హాట్‌స్పాట్లలో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల ఉనికిని కనిపెట్టే జాగిలాలను ఉపయోగించామని త్రీ టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా, రవాణా చేసినా, సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో త్రీటౌన్‌ ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నాటుసారా స్వాధీనం

టేకులపల్లి: మండలంలోని కొత్తతండా(జి), బొమ్మనపల్లితండా, బిల్లుడుతండా, లచ్యతండా, టేకులపల్లి గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌతమ్‌ తెలిపారు. దాడుల్లో సిబ్బంది వెంకటనారాయణ, గురవయ్య, సుమంత్‌, పార్థసారథి పాల్గొన్నారు.

అనారోగ్యంతో శునకం మృతి

శోకతప్త హృదయంతో దహన సంస్కారాలు

టేకులపల్లి: సాటి మనుషులు చనిపోతేనే పట్టించుకోని ఈ కాలంలో పెంపుడు శునకం మృతి చెందితే ఆ కుటుంబం కన్నీరు పెట్టిన ఘటన మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంతోటి నాగేశ్వరరావు – లీలాబాయి దంపతులు ఎనిమిదేళ్లుగా ఓ కుక్కను పెంచుతూ లక్కీ అని పేరు పెట్టారు. ఆ శునకంపై కుటుంబ సభ్యులు అమితమైన ప్రేమాభిమానాలు పెంచుకున్నారు. ఇటీవల సంక్రాంతి రోజున లక్కీ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన లక్కీ మంగళవారం మృతిచెందింది. లక్కీ మరణం తట్టుకోలేక కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లక్కీ మృతదేహాన్ని దాని పిల్లలకు చూపిస్తూ శోకతప్త హృదయంతో దహన సంస్కారాలు నిర్వహించారు.

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం 
1
1/3

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం 
2
2/3

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం 
3
3/3

రాష్ట్రస్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో రజతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement