సీఎం కప్‌ క్రీడా పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ క్రీడా పోటీలు ప్రారంభం

Feb 4 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:13 AM

సీఎం

సీఎం కప్‌ క్రీడా పోటీలు ప్రారంభం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలను స్థానిక ప్రకాశం స్టేడియంలో మంగళవారం జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్‌ డీఈఓ నాగలక్ష్మి, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి ప్రారంభించారు. మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు నియోజకవర్గస్థాయిలో కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్‌ క్రీడలను నిర్వహించారు. పోటీల్లో విజేతలను జిల్లాస్థాయి పోటీలకు పంపించనున్నారు. కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌, కొత్తగూడెం ఎంఈఓలు కృష్ణయ్య, బాలాజీ, లీల, మధురవాణితోపాటు నరేశ్‌, పులి లక్ష్మయ్య పాల్గొన్నారు.

మంత్రి పేరుతో వసూళ్లు?

విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు

ఖమ్మంక్రైం: మంత్రితో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తామని చెబుతూ ఓ వ్యక్తి డబ్బు డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమే రకు సీపీ సునీల్‌దత్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయగా.. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ బృందాలు కూడా రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తున్నాయి. మంత్రి పేరిట వసూళ్లకు పాల్పడిన నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తీర్థాల జాతరకు

విస్తృత ఏర్పాట్లు

అధికారులతో సమీక్షించిన

కలెక్టర్‌ అనుదీప్‌

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంరూరల్‌ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 14నుంచి 18వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. లక్షల్లో భక్తులు హాజరుకానున్న నేపథ్యాన విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆయన మాట్లాడారు. తీర్థాల జాతరకు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున గతంలో కంటే మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. అవసరమైన మేర పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. అంతేకాక బస్సుల ఏర్పాటు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ, కంట్రోల్‌ రూం ఏర్పాటుపై సూచనలు చేశారు. కాగా, జాతరలో వసతుల కల్పనకు కేటాయించిన రూ.10 లక్షల చెక్కును ఆలయ ఈఓ కె.వేణుగోపాల్‌కు కలెక్టర్‌ అందజేశారు. ఈసమావేశంలో డీఎంహెచ్‌ఓ రామారావు, డీపీఓ రాంబాబు, ఆర్‌డీఓ జి.నర్సింహారావు, మిషన్‌ భగీరథ ఈఈ పుష్పలత, ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కప్‌ క్రీడా పోటీలు ప్రారంభం 1
1/1

సీఎం కప్‌ క్రీడా పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement