జిల్లాకు మంచి పేరు తేవాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు మంచి పేరు తేవాలి

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

జిల్లాకు మంచి పేరు తేవాలి

జిల్లాకు మంచి పేరు తేవాలి

పాల్వంచ: జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. స్థానిక శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్‌ –2026 క్రీడాపోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టేబుల్‌ టెన్నిస్‌, షాట్‌పుట్‌ ఆటలు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆ తర్వాత 100, 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌, టెన్నిస్‌, ఆర్చరీ, జూడో పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మహీధర్‌, కోచ్‌లు నాగేంద్ర, మల్లికార్జున్‌, నాగరాజు, కల్యాణ్‌, ప్రసాద్‌, గిరి, డానియల్‌ రాంబాబు, రియాజ్‌, నరేష్‌, శ్రీనివాస్‌, వీరన్న, ఆదినారాయణ, అనిల్‌, రాము, సురేష్‌, సుజాత, మల్లేష్‌, మంజులాల్‌, శ్రీనివాస్‌, కృష్ణ, కావ్య పాల్గొన్నారు.

క్రీడాకారులకు

కలెక్టర్‌ సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement