‘వాడిన’ పూలే వికసించెలే... | - | Sakshi
Sakshi News home page

‘వాడిన’ పూలే వికసించెలే...

Feb 8 2026 4:11 AM | Updated on Feb 8 2026 4:11 AM

‘వాడి

‘వాడిన’ పూలే వికసించెలే...

● భద్రగిరి ఆలయంలో పూజకు వినియోగించిన పుష్పాలతో అగర్‌బత్తీలు ● టీటీడీ తరహాలో తయారీకి జైళ్ల శాఖ నిర్ణయం ● కరీంనగర్‌ జైలులో ఏడాది క్రితం, ఇప్పుడు భద్రాద్రిలో ప్రారంభం ● మార్కెట్‌ ధర కంటే తక్కువగా లభ్యం

మూడు రకాల అగర్‌బత్తీలు తయారుచేస్తున్నాం

రసాయనాలు లేకుండా..

● భద్రగిరి ఆలయంలో పూజకు వినియోగించిన పుష్పాలతో అగర్‌బత్తీలు ● టీటీడీ తరహాలో తయారీకి జైళ్ల శాఖ నిర్ణయం ● కరీంనగర్‌ జైలులో ఏడాది క్రితం, ఇప్పుడు భద్రాద్రిలో ప్రారంభం ● మార్కెట్‌ ధర కంటే తక్కువగా లభ్యం

భద్రాచలంఅర్బన్‌: ఆలయాల్లో పూజ చేశాక తొలగించే పూలతో అగరుబత్తీల తయారీకి జైళ్ల శాఖ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో రాష్ట్రంలోనూ వాడిన పూలతో అగర్‌బత్తీలు తయారు చేయాలని జైళ్ల శాఖ సంకల్పించింది. కరీంనగర్‌ జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో వివిధ వస్తువుల తయారీతో పాటు పెట్రోల్‌బంక్‌లు నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో భద్రాచలం రామాలయంలో పూజకు విని యోగించిన పూలతో అగరుబత్తీలు తయారు చేస్తుండగా.. మార్కెట్‌ ధర కంటే తక్కువకు లభిస్తుండడం విశేషం.

పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకూ సన్నాహాలు..

జైళ్లశాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలో త్వరలో పెట్రోల్‌బంకు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సబ్‌ జైలు అధికారి నివేదిక పంపగా అనుమతి లభించింది. ఇప్పటికే ఆర్టీసీ, జీసీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్‌బంకులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే జైళ్లశాఖ సైతం పలు నగరాల్లో పెట్రోల్‌బంకులు ఏర్పాటు చేయగా భద్రాచలంలో రెవెన్యూ అధికారులు ఇటీవలే స్థల పరిశీలన చేశారు. కలెక్టర్‌ పరిశీలించి ఆమోద ముద్ర వేస్తే, బంకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భద్రాచలంలో ఏర్పాటు చేసే బంక్‌లో శిక్ష అనుభవించి సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భద్రాచలం రామాలయంలో పూజకు ఉపయోగించిన పూలతో సబ్‌ జైలులో అగర్‌బత్తీలు తయారు చేస్తున్నాం. ఎలాంటి రసాయనాలు లేకుండా పూలను ఎండబెట్టి ఆ పొడితో పాటు సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తూ మూడు రకాలుగా ఉత్పత్తి చేస్తున్నాం. డిమాండ్‌ పెరిగి తే తయారీ సంఖ్యను కూడా పెంచుతాం.

– ఉపేందర్‌,

సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌, భద్రాచలం

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న అగరుబత్తీలు రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా ఉంటున్నాయి. ఆలయాల్లో వాడిన పూల ను ఎండబెట్టి, పొడిచేశాక కొన్నిసుగంధ ద్ర వ్యా లు కలిపి అగర్‌బత్తీలు తయారు చేస్తున్నా రు. ఇటీవల భద్రాచలం జైలు సందర్శనకు వచ్చిన డీజీపీ సౌమ్యా మిశ్రా ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత భద్రాద్రిజిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సైతం యూనిట్‌ను పరి శీలించి పలు సూచనలు చేశారు. ఒక్కో బాక్స్‌లో 20 స్టిక్స్‌ ఉంటుండగా రూ.20 చొప్పు న లభిస్తున్నాయి. ఖైదీలతో రోజుకు 100 బాక్సులు(2000 అగర్‌బత్తీలు) తయారు చేయిస్తున్నారు. భవిష్యత్‌లో ఆర్డర్లు పెరిగితే ఆ మేరకు తయా రు చేసేలా చర్యలు చేపడుతున్నారు. భద్రాచలంలో శాండిల్‌, రోజ్‌తో పాటు మరో ఫ్లేవర్‌లో అగర్‌బత్తీలు లభ్యమవుతున్నాయి.

‘వాడిన’ పూలే వికసించెలే...1
1/2

‘వాడిన’ పూలే వికసించెలే...

‘వాడిన’ పూలే వికసించెలే...2
2/2

‘వాడిన’ పూలే వికసించెలే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement