విద్యుత్ అంతరాయాలు అరికట్టాలి
పాల్వంచ: విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) మధుసూదన్ అన్నా రు. స్థానిక జెన్‌కో ట్రైనింగ్ సెంటర్‌లో మంగళవా రం ఆయన వివిధ విభాగాల అధికారులతో సీఈ రాజుచౌహాన్‌తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోకుండా చూడాలని, ప్రమాద భరితంగా ఉన్న లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వేసవి కాలంలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, 33/11 కేవీ లైన్లు, ఇంటర్ లింక్ లైన్లు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. పొలంబాట, ప్రజాబాట వంటి కార్యక్రమాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉంచాలని అన్నారు. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు, పరిశ్రమలకు నిర్ణీత కాలవ్యవధిలో కనెక్షన్లు మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ జి.మహేందర్, డీఈలు పి.నందయ్య, రంగస్వామి, జీవన్‌కుమార్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, ఈఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఏఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్


