● బరిలో దంపతులు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భార్యాభర్తలు బరిలో నిలిచారు. 49వ డివిజన్ నుంచి కనుకుంట్ల కుమార్, 10వ డివిజన్‌లో ఆయన సతీమణి కనుకుంట్ల వెంకటరమణ పోటీ చేస్తుండగా ఆదివారం ఆయా డివిజన్లలో ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు తామిద్దరమూ పోటీ చేస్తున్నామని, గతంలో పనిచేసిన అనుభవంతో డివిజన్లను అభివృద్ధిపథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వారికి పద్మశాలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు.


