దాదాపు వారం పాటు హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం స
నేడు పరిసమాప్తం
చివరిరోజు హోరెత్తించేలా
అభ్యర్థుల ప్రణాళిక
మున్సిపాలిటీలను చుట్టేయనున్న ముఖ్యనేతలు
ఆపై ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా తెరచాటు రాజకీయాలు
ఆఖరి మోఖా!
విస్తృతంగా ప్రచారం..
ఈనెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు వార్డుల్లో ఇంటింటి ప్రచారంతోపాటు పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాహనాలకు మైకులు అమర్చి ప్రచారాన్ని వేడెక్కించారు. ఇక రాజకీయ పార్టీల నుంచి ప్రధాన నేతలు సైతం ప్రచారంలో పాలు పంచుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల ఆధ్వర్యాన రోడ్‌షోలు కూడా నిర్వహించారు.
మరోమారు ముఖ్యనేతలు
ప్రచారానికి చివరిరోజు కావడంతో డివిజన్, వార్డుల్లో ప్రచారం చేయాలని అభ్యర్థులు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. దీంతో నేతలు కూడా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించుకున్నారు. అభివృద్ధిని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేసేలా బీఆర్‌ఎస్.. మరోపక్క బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా చివరి రోజున ప్రచారాన్ని రక్తికట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రల ద్వారా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి కూడా ప్రచారానికి హాజరవుతారు. ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు కూడా ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
లెక్కలు సిద్ధం!
బహిరంగ ప్రచారం గడువు ముగియగానే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టనున్నారు. ఓటు మేనేజ్‌మెంట్ ఎలా చేయాలనే అంశంపై ఇప్పటికే దృష్టి సారించగా.. రహస్యంగా ఓటర్లను కలిసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు వరకు మద్యం, నగదు పంపిణీపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏ వార్డులో పరిస్థితి ఎలా ఉంది.. ఎందరికి ఎంత మొత్తంలో పంపిణీ చేయాలనే లెక్కలను ముందుగానే వేసుకున్నట్లు తెలిసింది. వీటికి తోడు సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఓటర్లతో టచ్‌లోనే ఉండేలా సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో సోమవారం సాయంత్రం 5గంటలకు మైకుల మోత నిలిచిపోనుంది. చివరి రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులు తమ డివిజన్లు, వార్డుల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. భారీ ఎత్తున ర్యాలీలు, రోడ్‌షోలకు ఏర్పాట్ల్లు చేసుకున్నారు. ఓవైపు అభ్యర్థులు, మరోవైపు కార్యకర్తలతో ప్రదర్శనలు, వాహనాల్లో మైక్‌లు, ప్లెక్సీల ద్వారా ఎన్నికల గుర్తును ఓటర్లకు వివరించేలా హోరెత్తించనున్నారు.
నేడు ముగియనున్న ఎన్నికల ప్రచారం
దాదాపు వారం పాటు హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం స


