పెద్దమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

పెద్ద

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

రామాలయంలో

ఐటీడీఏ పీఓ పూజలు

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వాగతం పలికిన అనంతరం తన సతీమణితో కలిసి అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అదృత్‌ అవన్‌కు ఆలయ ప్రాంగణంలో అన్నప్రాశన జరిపారు. ఈ కార్యక్రమంలో పీఓ సతీమణి మనీషా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సతీమణి ప్రవీణ పాల్గొన్నారు.

కిన్నెరసానిలో

పర్యాటకుల సందడి

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. డీర్‌ పార్కులోని దుప్పులను, డ్యామ్‌, జలాశయం వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 408 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.19,800 ఆదాయం లభించింది. 180 మంది బోటింగ్‌ చేయడంతో 11,180 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నేడు గిరిజన దర్బార్‌

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్‌ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల తమ సమస్యలపై వినతులు అందజేయాలని కోరారు.

తహసీల్‌లోనూ..

భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయంలో కూడా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, మండల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జాతీయస్థాయిలో

ప్రతిభ

బూర్గంపాడు: మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కౌలురి సాధ్విక కరాటే పోటీలలో జాతీయ స్థాయిలో సత్తాచాటింది. రెడ్డిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జిల్లా, రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపింది. ఆదివారం ముంబైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆమెను మండల విద్యాశాఖ అధికారి యదుసింహారాజు, సర్పంచ్‌ బానోతు సరోజ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు.

పెద్దమ్మతల్లికి  విశేష పూజలు1
1/3

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

పెద్దమ్మతల్లికి  విశేష పూజలు2
2/3

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

పెద్దమ్మతల్లికి  విశేష పూజలు3
3/3

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement