ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
ఇల్లెందు: ప్రతీ రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించి ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కలిగించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కోరారు. మంగళవారం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను తనఖీ చేశారు. అక్కడి ఔషధాల పంపిణీ విభాగం, రక్త పరీక్ష కేంద్రం, ఇన్‌పేసెంట్, గర్భిణులు, గైనిక్ వార్డులు, ఎక్స్‌రే, స్టోర్ రూంలను తనిఖీ చేశారు. సౌకర్యాలు, నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌పేసెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేడారం జాతర ముగిసిన నేపథ్యంలో జ్వరాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించిన కలెక్టర్ మెటీరియల్ అవసరం అయితే ప్రతిపాదనలు పంపాలని కోరారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ హర్షవర్దన్, ఆర్‌ఎంఓ రాంనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ జయ, హెడ్ నర్సు ఫర్జానా, నర్సులు భవానీ, భారతి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ జితేశ్ వి.పాటిల్


