ఉత్పత్తి లక్ష్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తి లక్ష్యం సాధించాలి

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 7:46 AM

ఉత్పత

ఉత్పత్తి లక్ష్యం సాధించాలి

టేకులపల్లి: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) ఎం.తిరుమల రావు సూచించారు. గురువారం ఆయన కోయగూడెం ఓపెన్‌కాస్టులో పర్యటించారు. వ్యూ పాయింట్‌ నుంచి ఓసీలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆటంకాలు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కేఓసీ అధికారులు డైరెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు గోవింద రావు, ఆర్వీ నరసింహరాజు, మేనేజర్‌, శ్రీనివాస రావు, అంజిరెడ్డి పాల్గొన్నారు.

10న పవర్‌ లిఫ్టింగ్‌

ఎంపికలు

భద్రాచలంటౌన్‌: సీఎం కప్‌ పోటీల్లో భాగంగా ఈ నెల 10న భద్రాచలంలో జిల్లాస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ జి.వి. రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికలు ప్రారంభమవుతాయని, ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, పాల్గొనే క్రీడాకారులకు మధ్యాహ్నం ఉచిత భోజన వసతి ఉంటుందని తెలిపారు.

విలువిద్య కోచ్‌కు ఇంటర్వ్యూ

పాల్వంచరూరల్‌: విలువిద్య కోచ్‌ నియామకం కోసం కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో గురువారం ఇంటర్వ్యూ నిర్వహించారు. కిన్నెరసాని మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ల్లో ఖాళీగా ఉన్న విలువిద్య కోచ్‌ పోస్టు కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడగా, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ అశోక్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జ్యోతి, జిల్లా స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ గోపాల్‌ తదితరులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సభ్యులు పి.శంకరయ్య, హెచ్‌ఎం.చందు, పీడీలు బాలసుబ్రహ్మణ్యం, పద్దం రాంబాబు, పీఈటీ అంజయ్య, మారప్ప, ప్రసాద్‌, సంజిత్‌లు పాల్గొన్నారు.

ఉత్పత్తి లక్ష్యం సాధించాలి1
1/1

ఉత్పత్తి లక్ష్యం సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement