లారీ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

Feb 12 2026 7:25 AM | Updated on Feb 12 2026 7:25 AM

లారీ

లారీ ఢీకొని మహిళ మృతి

దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు సెంటర్‌లో జరిగిన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల మండలం బీఎస్‌ రామ య్య నగర్‌ గొల్ల గూడేనికి చెందిన కొట్టెం కమల (30) మృతి చెందింది. చర్లకు చెందిన కొట్టెం రాజు, కమల, కుమారుడితో కలిసి బైక్‌పై పెద్ద ఆర్లగూడెం వెళ్తున్నారు. ఈ క్రమంలో ములకపాడు దగ్గర ఎదురుగా వస్తున్న సిమెంట్‌ లోడ్‌ లారీ ఢీకొట్టింది. కమల తలపై నుంచి లారీవెనుక చక్రాలు వెల్లడంతో నుజ్జునుజ్జయి ఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందింది. భర్త, కుమారుడు పక్కకు పడటంతో వారు క్షేమంగా ఉన్నారు. కమల మృతితో భర్త, కుమారుడు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్‌ ఏర్పడగా, సీఐ వెంకటప్పయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్రమద్ధీకరించారు. మృతదేహాన్ని స్వయంగా రోడ్డు పక్కకు పెట్టారు. ఎస్‌ఐ గణేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ములకపాడు దగ్గర ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతుల వల్లే ప్రమాదం జరిగిందని, ఇప్పటికై నా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లారీ ఢీకొని వ్యక్తి..

అశ్వారావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని లక్కీ–3 అపార్ట్‌మెంట్‌ ప్రాంతానికి చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు(52) ద్విచక్రవాహనంపై సమీపంలోని ఏపీ రాష్ట్రం జీలుగుమల్లి మండలం తాటియాకులగూడేనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కాగా, ఇతనికి అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఓటు హక్కు ఉంది. తాటియాకులగూడెం నుంచి వచ్చి ఓటు వేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీలుగుమిల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని మహిళ మృతి1
1/1

లారీ ఢీకొని మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement