ఐటీడీఏలో ఇక డీడీఈఓ ! | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

ఐటీడీ

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !

● గిరిజన విద్య బలోపేతానికి సర్కారు నిర్ణయం ● సీనియర్‌ హెచ్‌ఎంలకు డిప్యుటేషన్‌పై బాధ్యతలు ● గతంలో సేవలందించిన ఏజెన్సీ డీఈఓలు

పీఓ కల సాకారమయ్యేనా ?

ఆదేశాలు రాలేదు

● గిరిజన విద్య బలోపేతానికి సర్కారు నిర్ణయం ● సీనియర్‌ హెచ్‌ఎంలకు డిప్యుటేషన్‌పై బాధ్యతలు ● గతంలో సేవలందించిన ఏజెన్సీ డీఈఓలు

భద్రాచలం: గిరిజన విద్య బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలో డిప్యూటీ డీఈఓ పోస్టులు భర్తీచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డీడీ పర్యవేక్షిస్తుండగా.. వారిపై విధుల భారం, ఒత్తిడి పెరుగుతుండడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టు జిల్లాకు తరలిపోవడంతో ఖాళీ అయింది. కాగా తాజాగా మళ్లీ డిప్యూటీ డీఈఓ పోస్టుతో ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది.

2016లో పోస్టు మాయం..

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గతంలో ఏజెన్సీ డీఈ ఓ పోస్టు ఉండేది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, గిరిజన గురుకులాలను ఈ డీఈఓ పర్యవేక్షించేవారు. ఆయా పాఠశాలల్లో తనిఖీ లు చేస్తూ, గిరిజన విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను రూపొందించేవారు. అయితే 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ డీఈఓ పోస్టును జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుగా అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పటి నుంచి డీఈఓ పరిధిలోనే అన్ని రకాల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతో ఐటీడీఏలో ఏజెన్సీ డీఈఓ పోస్టు మాయమైంది. చివరి ఏజెన్సీడీఈఓగా రవీందర్‌ బాబు బాధ్యతలు నిర్వర్తించారు.

నిరాశ పరుస్తున్న ఫలితాలు..

2016 తర్వాత ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఈ పాఠశాలల పర్యవేక్షణ పూర్తిగా గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిధిలోకి వెళ్లడం, ఆ అధికారికి ఇతర శాఖల పర్యవేక్షణ, పని ఒత్తిడితో పాఠశాలలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక డీడీలు ఉద్యోగ విరమణ చెందినప్పుడు ఏపీఓ జనరల్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం, మళ్లీ నూతన డీడీ రాగానే విధుల బదలాయింపు.. ఈ తరుణంలో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ విషయమై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ఐటీడీఏలో డిప్యూటీ డీఈఓలను నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. గిరిజన సంక్షేమ శాఖలోని సీనియర్‌ ప్యానల్‌ గ్రేడ్‌ హెచ్‌ఎంను డిప్యుటేషన్‌ పద్ధతిలో ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనపై పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు తదితర బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు.

ఐటీడీఏ పీఓగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక విద్యలో తెలుగు, గణితం, సైన్స్‌లో లోపించిన నైపుణ్యాలు, బేసిక్‌ అంశాలను పెంపొందించేందుకు ఉద్దీపనం, ప్రాక్టిస్‌ బుక్‌లు తయారుచేశారు. కెరీర్‌ గైడెన్స్‌, 100శాతం ఫలితాల సాధనకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. అయితే విద్యాశాఖ పోస్టు లేక ఆయనే పర్యవేక్షించాల్సి రాగా, పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ అయితే గిరిజన విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే పీఓ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం గిరిజన ఆశ్రమ పాఠశాలలను భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్లుగా విభజించారు. ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 3 బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు ఉండగా, గిరిజన గురుకులాలు జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో మరో 6 ఉన్నాయి. మొత్తంగా 27 గురుకులాలు, స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు రాగానే అమలుపరుస్తాం. గతంలో ఉన్న డీఈఓ పోస్టును తిరిగి భర్తీ చేయాలని గతంలో ప్రభుత్వానికి నివేదిక అందించాం.

– డేవిడ్‌రాజ్‌, ఐటీడీఏ ఏపీఓ జనరల్‌

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !1
1/1

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement