పరిమితికి మించి వైద్యం చేయొద్దు
అశ్వారావుపేటరూరల్/చుంచుపల్లి: గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ అన్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం, గుమ్మడవల్లి పీహెచ్‌సీలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఆ తర్వాత గ్రామీణ వైద్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పేషెంట్లకు అధిక మోతా దుతో కూడిన యాంటిబయోటిక్స్ వేయొద్దని సూచించారు. అనంతరం హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు రాందాస్‌నాయక్, మధుళిక, మోహన్, వెంకటేశ్వరరావు, దుర్గమ్మ పాల్గొన్నారు.
కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించాలి
కుష్ఠు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ అన్నారు. సోమవా రం తన కార్యాలయంలో వైద్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి మందుల వాడకం, లభ్యత వంటి వివరాలు తెలియజేయాలన్నారు. శరీరంపై మచ్చలు ఏర్పడితే సమీపంలోని పీహెచ్‌సీలో పరీక్ష చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.


