గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజా యిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవా రం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కూనవరం రోడ్డులో ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరావు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కని పించిన కారు, స్కూటీలను ఆపి తనిఖీచేయగా 14.6 కిలోల గంజాయి లభించింది. విచారించగా నిందితులు, సూర్యాపేట జిల్లాకు చెందిన షేక్ మస్తాన్, మహమ్మద్ ఇఫ్తాకర్, తోటపల్లి గోపి రెడ్డి, తోటపల్లి దిశ్వంత్ రెడ్డి, సికింద్రాబాద్‌కు చెందిన నీర్ల అంజన్ కుమార్ ఒడిశాలోని కలిమెల నుంచి సూర్యాపేట, హైదరాబాద్‌లకు గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి, వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 11.05లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను విచారణ నిమిత్తం భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు.


