● పోలింగ్ కేంద్రాల్లో ఎస్పీ పరిశీలన
అశ్వారావుపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్‌రాజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి అశ్వారావుపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను వేర్వేరుగా పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి పోలింగ్ వివరాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ఆయన వెంట సీఐ పి.నాగరాజు రెడ్డి, ఎస్‌ఐలు యయాతిరాజు, సాయికిషోర్ రెడ్డి ఉన్నారు.


