పూర్వ విద్యార్థికి రెండు బంగారు పతకాలు | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థికి రెండు బంగారు పతకాలు

Feb 10 2026 7:33 AM | Updated on Feb 10 2026 7:33 AM

పూర్వ

పూర్వ విద్యార్థికి రెండు బంగారు పతకాలు

అశ్వారావుపేటరూరల్‌: స్థానిక వ్యవసాయ కళాశాలకు చెందిన 2021 బ్యాచ్‌ విద్యార్థి హలావత్‌ చిన్నారికి విద్యారంగంలో చూపిన ప్రతిభకు రెండు బంగారు (డాక్టర్‌ సీహెచ్‌ కృష్ణమూర్తిరావు గోల్డ్‌ మెడల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గోల్డ్‌ మెడల్‌) పతకాలు దక్కాయి. సోమవారం వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ల చేతుల మీదుగా పతకాలు అందుకుంది. దీంతో స్థానిక కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, ప్రొఫెసర్లు, తోటి విద్యార్థులు చిన్నారికి అభినందనలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు.

రూ.4 కోట్ల విలువైన

గంజాయి దహనం

ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో నమోదైన 47 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 953 కేజీల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు సోమవారం దహనం చేశారు. తల్లాడ మండలం గోపాల్‌రావుపేటలో ఈ గంజాయిని కాల్చివేయగా, దీని విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 21 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 194 కేజీలు, భద్రాద్రి జిల్లాలోని 47 కేసుల్లో పట్టుబడిన 760 కేజీల గంజాయిని దహనం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎకై ్సజ్‌ అధికారి నాగేందర్‌రెడ్డి, ఏఈఎస్‌లు పాల్గొన్నారు.

అప్పుల బాధతో

కౌలురైతు ఆత్మహత్య

రఘునాథపాలెం: మండలంలోని చెరువుకొమ్ము తండాకు చెందిన కౌలు రైతు భూక్యా లక్ష్మా(40) కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే, పంటలు దెబ్బతినడంతో అప్పులు మిగిలిపోగా మద్యానికి బానిసైన లక్ష్మా జనవరి 13న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఘటనపై లక్ష్మా భార్య చంద్రావతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

పూర్వ విద్యార్థికి  రెండు బంగారు పతకాలు 1
1/1

పూర్వ విద్యార్థికి రెండు బంగారు పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement