● ప్రచారంలో వాకీ టాకీ !
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినూత్న రీతిలో ప్రచారం కొనసాగుతోంది. 56వ డివిజన్ నుంచి ఆర్‌ఎల్డీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈసంపల్లి మౌనిక లైసెన్డ్‌స్ వాకీటాకీని ఉపయోగిస్తూ.. అదే డివిజన్‌లోని ఇతర వీధుల్లో తన అనుచరులతో మాట్లాడుతూ.. ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటున్నారు.
● మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు !
కొత్తగూడెంఅర్బన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ఓ ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరానికి చెందిన సందీప్ తన ఇంటి గేటుకు ఈ మేరకు బోర్డులు ఏర్పాటు చేయగా, పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు.
● ప్రచారంలో వాకీ టాకీ !
● ప్రచారంలో వాకీ టాకీ !


