గళమెత్తారు.. | - | Sakshi
Sakshi News home page

గళమెత్తారు..

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

● వచ్చే వానాకాలానికి ఇప్పుడే ఎరువులు కొంటున్న కొందరు రైతులు ● గతేడాది యూరియా వెతల అనుభవంతో ముందస్తుగా అప్రమత్తత

జంక్షన్‌ డెవలప్‌మెంట్‌పై

ఫోకస్‌

యేసు త్యాగాలను స్మరిస్తూ..
జిల్లావ్యాప్తంగా శుక్రవారం క్రైస్తవులు గుడ్‌ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్ని చర్చిలు, మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు క్రీస్తు త్యాగాలను మననం చేసుకుంటూ ప్రదర్శనలు నిర్వహించారు. సిలువ యాత్రల్లో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. మానవాళి రక్షణకు ప్రభువు సిలువ మోశారని మత పెద్దలు వివరించారు.
రైతుల ఆందోళన

– వివరాలు 9లో...

పార్లమెంట్‌లో

పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎరువుల కొరత ఏర్పడుతుందని ప్రచారం

రవిచంద్ర

తెలంగాణ రాష్ట్రానికి అంచున ఉన్న జిల్లా ఛత్తీస్‌గఢ్‌, ఏపీలతో సరిహద్దులు పంచుకుంటోంది. ఒడిశా సరిహద్దు సైతం సమీపంలోనే ఉంది. పైగా ఈ నాలుగు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్న గిరిజనులు వివిధ అవసరాల నిమిత్తం జిల్లాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సెంటర్‌ పాయింట్‌గా ఉన్న భద్రాచలం, భద్రాచలంరోడ్‌ రైల్వే స్టేషన్‌న్లను జంక్షన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని, కొత్తగూడేనికి రైల్వే డివిజన్‌గా హోదా ఇవ్వాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎగువ సభలో కోరారు. మావోయిస్టుల ప్రభావం నుంచి ఇప్పుడే బయటపడుతున్న దండకారణ్య ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ పెరిగితే అభివృద్ధి త్వరితగతిన సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీంతోపాటు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, అందులో భాగంగా కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరగా.. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement