లండన్ ట్రినిటీ పరీక్షల్లో ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని శ్రుతిలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ 16వ బ్యాచ్ విద్యార్థు లు అంతర్జాతీయ సంగీత పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ ట్రినిటీ కాలేజ్ నిర్వహించిన వెస్ట్రన్ మ్యూజిక్ గ్రేడ్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, డైరెక్టర్ కె.ఏలియా, గౌరవ సలహాదారుడు ఎం.సత్యనారాయణరాజు పాల్గొన్నారు.


