‘భరోసా’ ఏదీ ?
ఇప్పుడు ఇస్తేనే మేలు
యాసంగి సీజన్‌లో రైతులకు
అందని సర్కారు సాయం
పంట పెట్టుబడుల కోసం
తప్పని నిరీక్షణ
సాగు భూములకే అందించాలని ప్రభుత్వ నిర్ణయం
క్రాప్ బుకింగ్ కొనసాగిస్తున్న
వ్యవసాయ శాఖ
పెట్టుబడులకు ఇబ్బందిగా ఉంది
బూర్గంపాడు: యాసంగి పంటల సాగు మొదలై రెండునెలలు కావొస్తున్న ప్రభుత్వం నుంచి రైతు భరో సా నిధులు విడుదల కాలేదు. సంక్రాంతికి యాసంగి రైతుభరోసా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్‌లో ప్రకటించినా.. ఇంతవరకు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే యాసంగిలో సాగు భూములకే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా, వ్యవసాయ శాఖ అధికారులు సాగుచేసిన పంటల వివరాలను నమో దు చేస్తున్నారు. క్రాప్ బుకింగ్‌తో పాటుగా శాటిలైట్ సర్వే నిర్వహించి సాగు భూముల వివరాలను గుర్తించాకే రైతు భరోసా అందుతుందని తెలుస్తోంది.
1.90లక్షల ఎకరాల్లో సాగు
ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 1.90లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అంచనా. ఇందులో ఎక్కువ విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. ఈ ఏడాది మిర్చి, కూరగాయల సాగు కొంతమేర తగ్గగా అపరాల సాగు పెరిగింది. వరి నాట్లు పూర్తయి నెలరోజులు దాటగా, మొక్కజొన్న పంట సాగు చేసి కూడా నెలన్నర కావొస్తోంది. రైతులు ప్రస్తుతం పంటలకు ఎరువులు వేయడంతో పాటు పురుగుమందులు చల్లుతున్నారు. యూరి యా కొరత రైతులను యాసంగిలో కూడా వేధిస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు వానాకాలం సీజన్ కంటే బస్తాకు రూ.150 నుంచి రూ.200 వరకు పెరి గాయి. పురుగుమందుల ధరలు కూడా వానా కాలం సీజన్‌తో పోలిస్తే పెరిగాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడం, ఉపాధి హామీ పనులు ప్రారంభం కావడంతో కూలీల కొరత ఏర్పడుతుండగా.. వారు కూడా ధరలు పెంచుతున్నారు. వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగిరావడం గగనమే అయింది. యాసంగిపై ఆశలతో రైతులు పంటల సాగు మొదలుపెట్టారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.6వేలు అందిస్తే పెట్టుబడులకు కొంతమేర అందుతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. గత యాసంగి సీజన్‌లో కూడా రైతు భరోసా అందకపోవడంతో ఈ ఏడాది అయినా అందుతుందా లేదా అని భయపడుతున్నారు.
యాసంగిలో పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్రాప్ బుకింగ్ సర్వే ఇంకా పూర్తి కాలేదు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడిప్పుడే బుకింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తరువాత శాటిలైట్ సర్వేతో పంట సాగు వివరా లను గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి కావడానికి మరో నెలన్నర సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటికి కొన్ని ప్రాంతాల్లో యాసంగి పంట చేతికి కూడా వస్తుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులతో సర్వే చేయించి పంటల నమోదు ప్రకారం రైతు భరోసా అందించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి నెల సగం పూర్తి కాగా, కొన్నిచోట్ల మొక్కజొన్న చేతికందే దశకు చేరిందని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుభరోసా అందించి తమకు అండగా నిలవాలని వారు వేడుకుంటున్నారు.
యాసంగిలో నాలుగెకరాలు వరి సాగు చేశాను. పెట్టుబడులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం రైతు భరోసా అందిస్తే ఎరువులు, పురుగుమందులకు ఉపయోగపడతాయి. ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడి పెట్టాం. – ఆవుల వెంకటేశ్వరరెడ్డి, నాగినేనిప్రోలు
‘భరోసా’ ఏదీ ?


