విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం | - | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం

Feb 10 2026 7:33 AM | Updated on Feb 10 2026 7:33 AM

విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం

విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం

విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గానే ఉన్నప్పుడే 1995లో అంబాజీపేటతోపాటు అశ్వారావుపేటలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటుచేశారు. అంతకుముందు 1988లో పట్టు పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ ఆవరణలో మల్బరీతోట సాగు చేస్తూనే ఆయిల్‌పామ్‌ మొక్కలు పెంచుతున్నారు. ఇదే ప్రాంగణాన్ని ఇటీవల ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు కేటాయించారు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన 1989లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే, 1988లో హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ కూడా ఏర్పాటైంది. ఉద్యాన యూనివర్సిటీ ద్వారా ఈ కేంద్రంలో పలు రకాల ఉద్యాన పంటల సాగు చేస్తూనే కొత్త వంగడాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అలాగే, అవేర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన రూరల్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఆర్‌వీటీసీ) ఐటీఐ కళాశాలను 1981లో ప్రారంభించారు. ఇక్కడ ఐటీఐతోపాటు అగ్రికల్చరల్‌ ఇంటర్మీడియట్‌ కోర్సు నిర్వహిస్తున్నారు. కాగా, అశ్వారావుపేట పంచాయతీ సమితిగా ఉన్నపుడు స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తుగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement