సామాజిక న్యాయానికి కృషి
భద్రాచలం: సమ సమాజ స్థాపన, సామాజిక న్యా యం కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంద ని, అందుకు నిబద్ధతతో ఉద్యోగులంతా పనిచేయాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా బుధవా రం మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ కులాల సర్వేతో పాటు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. దేశాభివృద్దిలో పౌరులంతా భాగస్వామ్యం అయ్యే సమ్మిళిత భారతావని కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు. అధికారులు వేణు, మధుకర్, గన్యా, రమేష్, రాంబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పంట వివరాలు సత్వరమే అందించాలి..
గిరిజన రైతులు సాగుచేసే పంటల వివరాలను సత్వరమే అందించాలని డేవిడ్‌రాజ్ అన్నారు. బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహావసరాలకు సేంద్రియ ఎరువులతో పండించే ఆహార పదార్థాల వివరాలను మండలాల వారీగా సేకరించాలని, గిరిజన రైతుల వద్ద దొరికే బియ్యం, మక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇతర ఆహార పదార్థాలు, మహిళలు తయా రు చేసే పచ్చళ్లు, ఇప్పపువ్వు లడ్డూలు, కరక్కాయ పౌడర్, కరక్కాయలు, తేనే, కారం, పసుపు, తృణ ధాన్యాలు, ఇతర వస్తువుల వివరాల నివేదిక అందజేయాలన్నారు. భద్రాచలంలో త్వరలో గిరిజన మార్ట్ ఏర్పాటు నేపథ్యంలో ఈ పంటలు దళారుల చెంతకు చేరకుండా నేరుగా మార్ట్‌కు సరఫరా అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్


