వైద్యులు అందుబాటులో ఉండాలి
గుండాల: ఏజెన్సీలోని వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండలంలోని ప్రభుత్వాస్సత్రిని తనిఖీ నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆస్పత్రిలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల గదిని పరిశీలించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంబులెన్స్ వాహనాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధులకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


