గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సీహెచ్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. భద్రాచలం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో కారును ఆపి సోదా చేయగా, 15.070 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులు, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన రఘు విష్ణోయి, రాజస్థాన్‌కు చెందిన శేఖర్ రామ్‌లను అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కారు, సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ. 10.73 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.
బంగారు ఆభరణాలు అప్పగింత
ఖమ్మంక్రైం: వైద్యం కోసం ఖమ్మం వచ్చి ఆభరణాలు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఆభరణాలు దక్కేలా పోలీసులు చేసిన కృషి ఫలించింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల గ్రామానికి చెందిన గుగులోత్ లక్‌పతి ఖమ్మంలో ఆస్పత్రికి గురువారం రాగా, ఆయన వద్ద 35 గ్రాముల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో ఖమ్మం టూ టౌన్ పోలీసు ఉద్యోగులు డి.శ్రీను, టి.భీముడు రంగంలోకి దిగారు. లక్‌పతి తిరిగిన ఆస్పత్రి, మెడికల్ షాప్ ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మెడికల్ షాప్‌లో ఆభరణాలు మరిచిపోయినట్లు తేలింది. దీంతో వాటిని ఎస్‌ఐ రమేష్ సమక్షాన బాధితుడికి అప్పగించడంతో కృతజ్ఞతలు తెలిపాడు.
ఇసుక వేలం
దమ్మపేట: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కొప్పుల రామనరేష్ ఆధ్వర్యంలో గురువారం ఇసుక వేలం పాట నిర్వహించారు. గత కొద్ది నెలలుగా అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక వాహనాలను సీజ్ చేసి, కేసు నమోదు చేయడమే కాక ఇసుకను స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ కార్యాలయంలో డంపింగ్ చేశారు. ఈ ఇసుకను వేలం వేయగా రూ.60,000 ధర పలికింది.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామ సమీపంలో మొండికుంట–భద్రాచలం రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మణుగూరుకు చెందిన కార్పెంటర్ తోకల ఽశంకర్ బైక్‌పై మణుగూరు వైపు వస్తుండగా మల్లెలమడుగుసమీపంలో చెట్టుకు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. 108లో స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మహిళ అదృశ్యం
భద్రాచలంఅర్బన్: మహిళ అదృశ్యంపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన కటారి శ్యామల (38) ఈ నెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. బుధవారం వరకు ఫోన్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ తర్వాత స్విచ్చాప్ వస్తోంది. శ్యామల కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి స్వాధీనం


