విద్యుదాఘాతంతో యువరైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 7:46 AM

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

కరకగూడెం:విద్యుదాఘాతానికి గురై యువరైతు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన చందా ప్రసాద్‌ (35) తన మూడు ఎకరాల పొలంలో వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో నీళ్లు పెట్టేందుకు పొలంలోని మోటారును ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీవీఎన్‌ రావు తెలిపారు. కాగా, విద్యుత్‌ శాఖ అధికారులు డీఈ జీవన్‌ కుమార్‌, ఏడీఈ ఉమ మహేశ్వరరావు, ఏఈ రాజశేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి భద్రతా లోపాలపై విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement