పుర పోరులో బాధ్యతల విభజన | - | Sakshi
Sakshi News home page

పుర పోరులో బాధ్యతల విభజన

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 7:46 AM

పుర ప

పుర పోరులో బాధ్యతల విభజన

విభాగాలు.. బాధ్యతలు

బృందాల వారీగా విధుల కేటాయింపు

ఖమ్మంమయూరిసెంటర్‌: పురపాలక ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈనెల 11న పోలింగ్‌, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పది విభాగాలకు నోడల్‌ అధికారులను నియమించారు. వీరంతా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

మానవ వనరులు : నామినేషన్ల పరిశీలన మొదలు ఓట్ల లెక్కింపు వరకు కావాల్సిన ఉద్యోగులను ఈ విభాగం ద్వారా నియమిస్తారు. మొత్తం ఎన్నికల్లో ఇది కీలక విభాగం.

బ్యాలెట్‌ పెట్టెల నిర్వహణ : కేంద్రాలకు బ్యాలెట్‌ పెట్టెలను చేర్చడం, పోలింగ్‌ తర్వాత స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించడం, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భద్రతను పర్యవేక్షించడం ఈ బృందం బాధ్యత.

రవాణా : పోలింగ్‌కు ముందురోజే ఉద్యోగులు, బ్యాలెట్‌ పెట్టెలు, భద్రతా బలగాలను వాహనాల ద్వారా కేంద్రాలకు చేర్చే విభాగం.

సామగ్రి, ముద్రణ : పోలింగ్‌, కౌంటింగ్‌కు కావాల్సిన వస్తువులను సమకూర్చడం, బ్యాలెట్‌ పేపర్లపై అభ్యర్థుల పేర్లను ముద్రించే బాధ్యతను ఈ విభాగం చూసుకుంటుంది.

వ్యయ నిర్ధారణ, పర్యవేక్షణ : అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తున్నారా లేదా అని ఆరా తీసే విభాగం ఇది. ఖర్చుల వీడియోలు, సీడీలను ఈ విభాగం ఉద్యోగులు నిక్షిప్తం చేస్తారు.

శిక్షణ, ఏర్పాట్లు : పోలింగ్‌, కౌంటింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇచ్చే విభాగమిది. వివిధ విభాగాల పరిశీలకులకు కావాల్సిన ఏర్పాట్లను సమన్వయం చేస్తుంది.

ఖాతాల నిర్వహణ : ప్రచార సభలు, సమావేశాలకు అయ్యే ఖర్చులను అంచనా వేసి, వాటిని అభ్యర్థుల ఖాతాల్లో చూపే విభాగం.

ప్రవర్తన నియమావళి : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ అనుసరిస్తున్నారా, లేదా అని నిఘా వేస్తారు. ఉల్లంఘనలు ఉంటే ఆధారాలు సేకరిస్తారు.

ఫిర్యాదులు, హెల్ప్‌లైన్‌, కేసులు : పార్టీలు, అభ్యర్థులు లేదా ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఎస్‌ఈసీకి నివేదిస్తారు. హెల్ప్‌లైన్‌కు అందే ఫిర్యాదులను పరిష్కరిస్తారు.

సమాచారం, నివేదికలు : ఎన్నికల సమాచారాన్ని మీడియాకు అందించడం, అవసరమైన నివేదికలు రూపొందించడం ఈ విభాగం ముఖ్య విధి.

పుర పోరులో బాధ్యతల విభజన 1
1/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 2
2/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 3
3/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 4
4/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 5
5/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 6
6/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 7
7/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 8
8/9

పుర పోరులో బాధ్యతల విభజన

పుర పోరులో బాధ్యతల విభజన 9
9/9

పుర పోరులో బాధ్యతల విభజన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement