ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ ! | - | Sakshi
Sakshi News home page

ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ !

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 7:46 AM

ప్రచా

ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ !

సామాజిక మాధ్యమాల్లో... ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ వాట్సాప్‌లో హోరాహోరీ ప్రత్యేక పాటలు

ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార ఫొటోలు, హామీలతో పోస్టింగ్‌లు

ప్రత్యేక బృందాలను

నియమించుకున్న అభ్యర్థులు

వైరా: మున్సిపల్‌ ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన ఓటర్లకు మరింత చేరువయ్యేలా ప్రచార పంథా మార్చారు. గతంలో ఓటర్లను ప్రత్యేకంగా కలిసి తాము ఏమేం చేస్తామో చెబుతూ మద్దతు కోరేవారు. ఇది ఇప్పుడూ కొనసాగుతున్నప్పటికీ ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకుని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

ప్రస్తుతం చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి చేతుల్లో ఇంటర్నెట్‌తో కూడిన సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. అంతేకాక అందరికీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, వాట్సాప్‌ ఖాతాలు ఉన్నాయి. వీటి ఆధారంగా అభ్యర్థులు తమ ప్రచార శైలి, ఇచ్చే హామీలను ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు. అంతేకాక పత్రికల్లో ప్రచురితమవుతున్న కథనాల క్లిప్పింగ్‌లను ప్రతిరోజు ఉదయం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేలా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించుకున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఓటర్లను ఆకట్టుకునేలా పాటలు రికార్డింగ్‌ చేయించారు. అలాగే, రీల్స్‌ ద్వారా కూడా తమ సందేశాన్ని పంపిస్తున్నారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారానికి సోషల్‌ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రచారంలో భాగంగా గతంలో చేసిన సేవా కార్యక్రమాల వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. అలాగే, ప్రచార సమయాన ప్రత్యేక ఫొటోగ్రాఫర్లతో చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలకు పాటలు జత చేసి పోస్ట్‌ చేస్తూ కొత్త ట్రెండ్‌తో హోరెత్తిస్తున్నారు.

కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులంతా వార్డుల వారీగా ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటుచేశారు. ఇందులోని వార్డులోని ఓటర్లను యాడ్‌ చేసి తమ ప్రచార ఫోటోలు, వీడియోలను పోస్టు చేస్తూ, తమను గెలిపిస్తే చేసే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కలిసి దిగిన ఫొటోలు, ప్రచారంలో వారి వీడియోలతో రీల్స్‌ కూడా పోస్టు చేస్తున్నారు.

ఓటర్లను సులువుగా ఆటకట్టుకునేలా పలువురు అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలు రాయించారు. వీటిని స్టూడియోల్లో రికార్డు చేయించడమే కాక వీడియోలు జత చేస్తున్నారు. పేరున్న గాయకుడు తెలంగాణ గద్దర్‌ గతంలో పాడిన పాటల్లో కొంత భాగం తీసుకుని తమ వీడియోలకు జత చేసి పోస్ట్‌ చేస్తున్నారు. ఇలా ఖర్చుకు వెనుకాడకుండా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చేస్తున్న ‘నయా’ ప్రచారంతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి.

వార్డుల వారీగా

వాట్సాప్‌ గ్రూపులు

ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ !1
1/2

ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ !

ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ !2
2/2

ప్రచారంలో ‘సోషల్‌’ ట్రెండ్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement