గిరిజన సంస్కృతికి ప్రతీకగా మ్యూజియం
భద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూ జియం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని ఐ కార్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన కుటుంబసభ్యులతో కలి సి మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ పొందుపరిచిన చిత్రాలు, పరికరాలు గిరిజనుల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. నేటితరానికి తెలిసేలా ఏర్పాట్లు చేయ డం బాగుందన్నారు. ఈ మేరకు కృషి చేసిన పీఓ రాహుల్, సిబ్బందిని అభినందించారు. అంతకుముందు శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు.
గిరిజన మ్యూజియానికి హంగులు..
దేశ, విదేశీ పర్యాటకుల ఆదరణ పొందుతున్న గిరిజన మ్యూజియాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మ్యూజియం ప్రాచుర్యాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై యూనిట్ అధికారులతో చర్చించారు. బోటింగ్, సెల్ఫీ పాయింట్, పెయింటింగ్, మినీ థియేటర్ ఏర్పాటుకు సంబంధించిన పరిసరాలను పరిశీలించారు. గిరిజన సంప్రదాయ దుస్తులను ధరించి ఫొటోలు దిగేందుకు పర్యాటకులకు సహకరించాలన్నారు. ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, అధికారులు రాంబాబు, ఉదయ్‌కుమార్, హరీష్, ప్రభాకర్ రావు, వీరాస్వామి పాల్గొన్నారు.


