ఎకో టూరిజం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

ములకలపల్లి: సహజసిద్ధ ప్రశాంత వాతావరణంతోపాటు చక్కటి వెదురు ప్లాంటేషన్లతో నిండిఉన్న అక్షరాలలొద్ది, పాండవుల గుట్టల ప్రదేశాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ తెలిపారు. మండలపరిధిలోని మధ్యతరహా నీటిపారుదల జలాశయం మూకమామిడి ప్రాజెక్ట్‌, నల్లముడి శివారులోని అక్షరాలలొద్ది గుహ, పాండవుల గుట్టను ఆదివారం ఆయన సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిఽశీలించి, పురాతన కాలంనాటి చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. స్థలపురాణాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పాల్వంచ వైద్యుడు సోమరాజు దొర, స్థానికులు తాండ్ర బుచ్చిబాబు, చిన్నారి, వాసు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కప్‌తో క్రీడాకారులకు ప్రోత్సాహం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సీఎం కప్‌తో గ్రామీణస్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సీఈఆర్‌ క్లబ్‌లో సీఎం కప్‌ క్రీడా పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు ప్రతిభ చాటుతూ రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కరాటే, యోగా, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, అత్యపత్య, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, సాఫ్ట్‌బాల్‌, హాకీ, నెట్‌బాల్‌, తైక్వాండో, బ్యాడ్మింటన్‌ తదితర 13 రకాల క్రీడాపోటీలను పరిశీలించారు. తొలిరోజు విజేతలకు పతకాలు బహూకరించారు. ఈకార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ నరేష్‌, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement