ఇదీ మా అజెండా..! | - | Sakshi
Sakshi News home page

ఇదీ మా అజెండా..!

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

ఇదీ మ

ఇదీ మా అజెండా..!

కోతులు, కుక్కల బెడద ఉంది.. అందుబాటులో ఉండాలి..

‘బొగ్గు గనుల విస్తరణతో సత్తుపల్లిలో రోజురోజుకు కాలుష్యం కోరలు చాస్తోంది. దుమ్ముధూళితో పాటు వాయు, నీటి కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా పట్టణ వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు...’ అని పలువురు వెల్లడించారు. ఈ మేరకు మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులు ప్రధానంగా ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యాన సత్తుపల్లి జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నీలాద్రి అర్బన్‌ పార్క్‌ల్లో ‘సాక్షి’ ఆధ్వర్యాన ప్రజల అజెండాపై బుధవారం డిబేట్‌ నిర్వహించగా వాకర్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులే కాక విద్యార్థులు పాల్గొనగా.. ఎన్నికల సమయాన హామీలకే పరిమితం కాకుండా సింగరేణి కాలుష్య నివారణ చర్యలపై కార్యాచరణ చేపట్టాలని కోరారు. అంతేకాక గెలిచిన కౌన్సిలర్లు అందుబాటులోఉండాలని.. కోతుల, కుక్కల బెడద నుంచి కాపాడాలనే సూచనలు వచ్చాయి.

– సత్తుపల్లిటౌన్‌

పట్టణంలో వీధి కుక్కలతో పాటు కోతుల బెడద తీవ్రంగా ఉంది. వీటి బారి నుంచి ప్రజలను కాపాడాలి. అలాగే, వార్డుల్లో సదుపాయాల కల్పనపై పాలకవర్గం దృష్టి పెట్టాలి. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి.

– ఎం.గాయత్రి

ఎన్నికల్లో గెలిచే కౌన్సిలర్లు స్థానికులకు అందుబాటులో ఉండాలి. సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుంది. పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి, కాలుష్య రహిత వాతావరణం కోసం పాటుపడాలి. – సయ్యద్‌ సలీం

ఇదీ మా అజెండా..!1
1/3

ఇదీ మా అజెండా..!

ఇదీ మా అజెండా..!2
2/3

ఇదీ మా అజెండా..!

ఇదీ మా అజెండా..!3
3/3

ఇదీ మా అజెండా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement