20 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని పత్తి రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. 2025 – 26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లు ఈ నెల 20 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని తెలిసిందని, త్వరలోనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.
సీఎం కప్ పోటీల్లో
బంగారు పతకం
దుమ్ముగూడెం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యా ర్థిని పూసం ప్రజ్ఞిద జిల్లాస్థాయిలో నిర్వహించిన సీఎం కప్ అండర్ – 18 అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. మంగళవారం విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
పామాయిల్ హబ్‌గా తీర్చిదిద్దుతా
● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
దమ్మపేట: దేశానికే తలమానికంగా ఉండేలా రాష్ట్రాన్ని పామాయిల్ హబ్‌గా తీర్చిదిద్దుతా నని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని గండుగులపల్లిలో తన నివాసంలో ఆయిల్ ఫెడ్ క్యాలెండర్ల ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పామాయిల్ సాగుచేస్తున్న రైతులు ఎకరాకు రూ.లక్ష స్థిర ఆదాయంతో ఆర్థికాభివృద్ధి చెందారని అన్నా రు. కేంద్ర బడ్జెట్‌లో పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని ఆశించినంతగా పెంచకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయ యాంత్రీకరణను బలోపేతం చేసి, సాగును సులభతరం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ మేనేజర్లు నాగబాబు, కార్తీక్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కె.వి. తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిది క్వింటాళ్ల మిర్చి చోరీ
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల రైతులు కల్లాలో ఆరబెట్టిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. ఇటీవల రెండు ఘటనలు చోటుచేసుకోగా సోమవారం అర్ధరాత్రి చిమ్మపూడిలో గ్రామానికి చెందిన రైతు జానేబోయిన పాపయ్య కల్లం నుంచి ఎనిమిది క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లారు. ఈ మిర్చి విలువ సుమారు రూ.1.60 లక్షలు కాగా ఘటనపైరఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు.


