పురపోరు నేడే.. | - | Sakshi
Sakshi News home page

పురపోరు నేడే..

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

పురపోరు నేడే..

పురపోరు నేడే..

ఒక కార్పొరేషన్‌,

రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు

జిల్లాలో 288 పోలింగ్‌ స్టేషన్లు,

1.85 లక్షల మంది ఓటర్లు

పోలింగ్‌ ప్రాంతాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

సిద్ధంగా పోలింగ్‌ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం కార్పొరేషన్‌, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు కలిపి మొత్తం 106 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 1,85,348 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 వార్డులకు 1,34,775 మంది ఓటర్లు, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డుల్లో 16,850 మంది ఓటర్లు, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు 33,723 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 90 పోలింగ్‌ లొకేషన్లలో 288 కేంద్రాలు ఏర్పాటు చేశా రు. అన్ని సెంటర్లలోనూ తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు.

సామగ్రి పంపిణీ

పోలింగ్‌ ప్రక్రియలో ఉపయోగించే బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు సహా ఎన్నికల సామగ్రి పంపిణీ ని మంగళవారం మధ్యాహ్నమే పూర్తి చేశారు. పోలింగ్‌ నిర్వహణకు జిల్లాలో మొత్తం 345 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,036 మంది ఇతర పోలింగ్‌ అధికారులను (రిజర్వ్‌తో కలిపి) నియమించారు. పోలింగ్‌ విధుల్లో 48 మంది రిటర్నింగ్‌ అధికారులు, 48 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణకు ఎంపిక చేసిన పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

నేడు సెలవు

పోలింగ్‌ జరిగే మున్సిపాలిటీ ప్రాంతాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హత కలిగిన ప్రతీ ఓటరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ ఎన్నికలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలన్నారు.

కౌంటింగ్‌కు కూడా సిద్ధం

కౌంటింగ్‌ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కేంద్రాలను గుర్తించి నోటిఫై చేశారు. కొత్తగూడెం ము న్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓట్ల లెక్కింపునకు పాల్వంచలోని అనుబోస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఇల్లెందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్‌ (24 ఏరియా), అశ్వారావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాలో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సిబ్బందిని ముందుగానే గుర్తించి ఇప్పటికే వారికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్లు కూడా సిద్ధం చేశారు.

మున్సిపల్‌ సమరానికి

సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement