విద్యుత్ శాఖపై ఆరోపణలు అవాస్తవం
కరకగూడెం: నిరంతరం ప్రజలకు, రైతులకు సేవలందిస్తున్న విద్యుత్ శాఖపై కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్) రవీంద్రనాథ్ తెలిపారు. ఇటీవల అనంతారం పంచాయతీలో విద్యుత్ శాఖ అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆయన విచారణ చేపట్టారు. విద్యుత్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా, నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డీఈ జీవన్ కుమార్, ఏడీఈ ఉమామహేశ్వరరావు, ఇన్‌చార్జ్ ఏఈ రాజశేఖర్, లైన్‌మన్ నరసింహారావు, సర్పంచ్ పాయం కృష్ణవేణి, ఉపసర్పంచ్ పూజారి వెంకన్న పాల్గొన్నారు.
సీజీఎం రవీంద్రనాథ్


