అవగాహనతో విధులు నిర్వహించాలి
పాల్వంచ: జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికులను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమితులైన పీఓలు, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారి తీయొచ్చని, ప్రతి పోలీంగ్ అధికారి పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని చెప్పారు. ఓటింగ్ సామగ్రి, నిర్వహణ, పోలీంగ్ కేంద్రాల్లో శాంతి భద్రతలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. పారదర్శికత, నిష్పక్షపాతం కీలకమని, ఎన్నికల కోడ్‌ను కఠినంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ, మున్సిపల్ మేనేజర్ ఎల్‌వీ సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ విద్యాచందన


