ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చా రు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
20 నుంచి ఫాల్గుణ మాసోత్సవాలు
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 20న ఫాల్గుణ మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈఓ కె. దామోదర్‌రావు, వైదిక పెద్దలు తెలిపారు. 27న సంధ్యా హారతి, 28న పునర్వసు సందర్భంగా తిరుమంజనం, సార్వభౌమ వాహన సేవ, 29న పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని పట్టాభిషేకం ఉంటాయని పేర్కొన్నారు. మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7.30 గంటల తర్వాత ఆలయ తలుపులు మూసేస్తామని, తిరిగి రాత్రి 7గంట లకు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం చేశాక 8.30 గంటల నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని వివరించారు. 4వ తేదీన వసంతో త్సవం, డోలోత్సవం సందర్భంగా పసుపు, కుంకుమ దంచి తలంబ్రాలు కలపడంతో శ్రీరామనవమి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 7న సుదర్శన హోమం, 15న లక్ష కుంకుమార్చన ఉంటాయని వెల్లడించారు.
నేడు అథ్లెటిక్స్
చాంపియన్ షిప్ పోటీలు
పాల్వంచ/పాల్వంచరూరల్ : సీఎం కప్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం స్థానిక శ్రీనివాస కాలనీ క్రీడామైదానంలో నిర్వహించనున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల అనంతరం విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్ల డించారు. మొత్తం 58 అంశాల్లో ఐదు వయో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, ఉత్తమ ప్రతిభ చూపిన 30 మందిని ఎంపిక చేసి ఈనెల 21న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.
ముత్తంగి అలంకరణలో రామయ్య


