కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈ నెల 8న వైజాగ్‌లో..
భక్తుల కోరిక మేరకు ఈ నెల 8న వైజాగ్‌లో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణాన్ని జరపనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా వైజాగ్‌లోని రాజప్పనాయుడు వీధి రామాలయ నిర్వహణ సేవా సంఘం సంప్రదించారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు 7న శోభాయాత్ర, 8న కల్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుస్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
మెరుగైన సేవలు
అందించాలి
అశ్వారావుపేటరూరల్: బాధితులకు 108, 102 వాహనాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని జిల్లాప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ అన్నా రు. గురువారం ఆయన అశ్వారావుపేట ప్రభు త్వ ఏరియా ఆస్పత్రితోపాటు 108, 102 వాహనాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. వాహనాల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏ ఎంఈ మనోహర్, పైలెట్‌లు రామకృష్ణ, కొప్పు ల ధర్మరాజు, ఈఎంటీ సుహాసిని పాల్గొన్నారు.
విద్యుత్ ఫెన్సింగ్
ప్రాణాంతకం
ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టూ అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గతంలో అనేక చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్లకు నేరుగా లేదా అనధికారికంగా వైర్లు అనుసంధానించి ఫెన్సింగ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు తెలియక తాకితే ప్రాణాపాయం కలుగుతుందని అన్నారు. పంటల రక్షణకు సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
కనుల పండువగా కల్యాణం
కనుల పండువగా కల్యాణం


